వారికి బిగ్ షాక్.. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు లేవు.. ఎస్ఈసీ కీలక ప్రకటన..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం నోటిఫికేషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని గ్రామ పంచాయతీలు, వార్డులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే.. కొన్ని స్థానాల్లో కోర్టు వివాదాల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముఖ్యంగా ములుగు, కరీంనగర్ జిల్లాల్లోని సుమారు 27 గ్రామ పంచాయతీలకు, 14 ఎంపీటీసీ స్థానాలకు హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదని ఎస్ఈసీ తెలిపారు.