సంక్రాంతి స్పెషల్ బస్సులతో ఆర్టీసీకి రూ.100 కోట్ల ఆదాయం
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9 నుంచి 14 వరకు తెలంగాణ ఆర్టీసీ 6 వేల స్పెషల్ బస్సులు నడిపింది. హైదరాబాద్ నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు రోజుల పాటు సుమారు 2 కోట్ల 40 లక్షల మంది ప్రయాణించారు.