Daughter Kills Mother: మానవత్వం మరిచిన కూతురు.. ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే చంపిన కుమార్తె..

Daughter Kills Mother: కుటుంబ ఆస్తి కోసం, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లిని కడతేర్చిన ఓ 23 ఏళ్ల కూతురి ఘాతుకం జైపూర్‌లో వెలుగుచూసింది. ఈ దారుణ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు సదరు యువతి ఏకంగా రూ. 7 లక్షల సుపారీ ఇచ్చింది. వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో ఎస్‌యూవీతో తల్లిని తొక్కించి చంపేలా కుట్ర పన్నింది. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో జూలై 3న ఈ ఘోరం జరిగింది. బాధితురాలు, 45 ఏళ్ల నీరజ్ శర్మ ఓ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా పనిచేస్తున్నారు. సంఘటన రోజున నీరజ్ శర్మ తన కుమారుడిని కోచింగ్ సెంటర్‌లో దించి ఇంటికి తిరిగి వస్తుండగా.. సుమారు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన స్కార్పియో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఆ ప్రమాద తీవ్రతకు ఆమె శరీరం దాదాపు 100 అడుగుల దూరం గాల్లోకి ఎగిరి పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు.