ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులను సీఎం దంపతులు ఆప్యాయంగా పలకరించారు. క్రీడా పోటీలను ఆసక్తిగా తిలకించారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రంగవల్లులు, ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు..ఈ క్రీడల్లో లోకేష్ కుమారుడు దేవాన్ష్ పాల్గొన్నారు. ఆటల్లో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేయనున్నారు.. సీఎం చంద్రబాబు ఇంటి దగ్గరే ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈనెల 15 వరకు నారావారిపల్లిలోనే సీఎం కుటుంబం ఉంటుంది.