ఉక్రెయిన్ దాడులతో ఇంధన కొరత.. భారత్‌ నుంచి పెట్రోల్ కొనుగోలు చేస్తోన్న రష్యా

ఇటీవల గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యా ఉక్కిరిబిక్కిరివుతోంది. క్రెమ్లిన్ ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా కీవ్ డ్రోన్లు ప్రయోగించి, తీవ్ర నష్టం కలిగిస్తోంది. దీంతో మాస్కోలో ఇంధన ఉత్పత్తి నిలిచిపోయి.. కొరత ఏర్పడింది. దీనిని అధిగమించడానికి పెట్రోల్‌ను భారత్ సహా పలు దేశాల నుంచి క్రెమ్లిన్ దిగుమతి చేసుకుంటోంది. గత రెండు రోజుల నుంచి భారత్ నుంచి రష్యాకు పెట్రోల్ ఎగుమతి అయినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకుని.. శుద్ధిచేసిన తర్వాత దానిని విదేశాలకు భారతీయ రిఫైనరీలు అమ్ముతున్నాయి.