చేపల చెరువుల తవ్వకాలపై ప్రజాగ్రహం

మంచినీటి చెరువు, పచ్చని పంట పొలాల మధ్య చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలపై ప్రజలు తిరగబడ్డారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామస్థులు, కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామస్థులు వేర్వేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తాగు, సాగు నీటిని కలుషితం చేసే చెరువుల తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని ధర్నాచౌక్‌లో ధర్నాకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.