తమిళనాడులో 60 ఏళ్ల ద్రవిడ పార్టీల పాలనకు బ్రేక్.. డీఎంకే, అన్నాడీఎంకేలను దెబ్బకొట్టిన విజయ్

తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల దశాబ్దాల పాలనకు తెరపడింది. 60 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ రెండు పార్టీలు కాకుండా మూడో పార్టీ అధికారాన్ని చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. 6 దశాబ్దాలుగా తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య అధికారం మార్పిడి కాగా.. ఇప్పుడు దాన్ని విజయ్ ఒడిసిపట్టుకున్నాడు. దీంతో ద్రవిడ పార్టీల పాలనకు బ్రేక్ వేస్తూ.. టీవీకే అత్యధిక సీట్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఇన్ని దశాబ్దాల తర్వాత ఈ రెండు పార్టీలు లేకుండా తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.