తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‍ ఉద్యోగాలపై కీలక అప్‌డేట్.. వివరాలు సేకరణ..

తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వ్యవస్థల్లోని అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగుల వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియలో సుమారు 15 వేల మంది నకిలీ ఉద్యోగులు ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. పని చేయకుండానే జీతాలు పొందుతున్న వీరిని తొలగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున నిధులు ఆదా కానున్నాయి. మరోవైపు 2026-27 బడ్జెట్ కసరత్తు మొదలైందని.. రియల్ ఎస్టేట్‌లో 12 శాతం, మైనింగ్‌లో 22 శాతం ఆదాయ వృద్ధి నమోదైందని ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తెలిపారు. అక్రమాలను అరికట్టి.. పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.