'మోదీ మంచోడే.. కానీ నన్ను సంతోషంగా ఉంచట్లేడు': రష్యాతో భారత్ వ్యాపారంపై ట్రంప్ హెచ్చరికలు

ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికెత్తుతూనే.. రష్యా చమురు వ్యవహారంలో భారత్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయకపోతే.. భారత ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న 50 శాతం భారీ టారిఫ్‌లను మరిన్ని రెట్లు పెంచుతామని ఆయన హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ చాలా మంచి వ్యక్తి, నన్ను సంతోషంగా ఉంచడం వారికి అవసరమని ఆయనకు తెలుసు. కానీ రష్యా విషయంలో సహకరించకుంటే మేం టారిఫ్‌లను చాలా వేగంగా పెంచగలం అని ట్రంప్ స్పష్టం చేశారు.