తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్: సంక్రాంతి సెలవులు పొడిగింపు ...ఈఏడాది ఎన్నిరోజులో తెలుసా?

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పాఠశాలలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది.ఈ ఏడాది సంక్రాంతి సెలవులు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు ఇచ్చింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. గతంలో స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్‌లో 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసిన హాలిడేస్ లిస్టులో 16న కనుమ సందర్భంగా సెలవు ఇచ్చారు. ఈ సెలవులపై సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో సంక్రాంతి హాలీడేస్ రివైజ్డ్ డేట్లను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రకటించారు. ఈనెల 10 నుంచి 16 వరకు అన్ని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపారు. ఈనెల 17న స్కూళ్లు రీఓపెన్ అవుతాయని పేర్కొన్నారు., News News, Times Now Telugu