నేపాల్‌లో మసీదుపై దాడి.. సరిహద్దు మూసేసిన భారత్, రాకపోకలూ బంద్!

పొరుగు దేశం నేపాల్‌లో ఒక్కసారిగా చెలరేగిన మతపరమైన చిచ్చు సరిహద్దు ప్రాంతాలను వణికిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక చిన్న వీడియో క్లిప్ కాస్తా రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలకు దారితీయడంతో.. సరిహద్దు పట్టణమైన బిర్‌గంజ్‌ రణరంగంగా మారింది. మసీదుపై దాడి, పోలీసులపై రాళ్ల వర్షం, స్టేషన్ల ధ్వంసం వంటి ఘటనలతో నేపాల్ అట్టుడుకుతోంది. ఈ సెగ భారత్ వైపు పాకకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. బీహార్ సరిహద్దులోని రక్సాల్ వద్ద రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, సశస్త్ర సీమా బల్ (SSB) బలగాలు సరిహద్దును క్లోజ్ చేశాయి.