"నార్త్ ఇండియన్స్‌కు హిందీ తప్ప ఏమీ రాదు.. ఇక్కడకు వచ్చి పానీపూరీ అమ్ముకుంటారు": తమిళనాడు మంత్రి సంచలనం

తమిళనాడు ఎన్నికల నగారా మోగకముందే భాషా యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఉత్తర భారతీయులు కేవలం హిందీని మాత్రమే నమ్ముకోవడం వల్లే ఉపాధి కోసం తమిళనాడుకు వచ్చి పానీపూరీ అమ్ముకుంటున్నారంటూ మంత్రి ఎం.ఆర్.కె. పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చిచ్చు రేపాయి. ఓవైపు తమిళులు ఆంగ్ల భాషా నైపుణ్యంతో విదేశాల్లో కోట్లు గడిస్తుంటే.. మరోవైపు హిందీ ప్రాంతాల వారు నైపుణ్యం లేక కూలీ పనులకు పరిమితం అవుతున్నారని ఆయన చేసిన విశ్లేషణ ప్రాంతీయ విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చింది.