పంచాయతీల్లో నవతరం.. కామారెడ్డి జిల్లాలో 175 మంది సర్పంచ్ లు యువకులే
పల్లె పాలనలో నవతరం వచ్చింది. ఇంత వరకు గ్రామ పాలకులుగా మధ్య వయస్సు, వృద్ధులు కనిపించేవారు. గతంలో యువత సంఖ్య తక్కువ. మారిన రాజకీయ పరిస్థితులతో యువత, విద్యావంతుల వైపు పల్లె ఓటర్లు మొగ్గు చూపారు.