పట్టాలెక్కనున్న బుల్లెట్ ట్రైన్లు.. అనంతగిరి, నల్లమల మీదుగా హైస్పీడ్ కారిడార్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్ధిని వేగవంతం చేసేలా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు, వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్-పుణె కారిడార్‌ను అనంతగిరి మీదుగా.. హైదరాబాద్-బెంగళూరు కారిడార్‌లోని మన్ననూరు స్టేషన్‌ను నల్లమల పేరుతో ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంలో కాకతీయ సామ్రాజ్య వారసత్వం ఉట్టిపడేలా.. రాణి రుద్రమదేవి, రుద్రదేవుడు, భారీ నంది విగ్రహాలతో ప్రవేశద్వారం వద్ద ఐలాండ్ నిర్మించాలని సీఎం ఆదేశించారు.