బీచ్‌లో నిద్రించిన భారత సంతతి విద్యార్థినులు.. రాకాసి అలలకు సముద్రంలోకి కొట్టుకుపోయి ఇద్దరి మృతి!

అమెరికాలోని కాలిఫోర్నియా సముద్రతీరంలో ఘోర ప్రమాదం జరిగింది. శాంటా క్రూజ్ కౌంటీలోని బోనీ డూన్ బీచ్‌కు విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు భారత సంతతి యువతులు రాకాసి అలల ధాటికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. అలసటగా ఉండడంతో.. సముద్ర తీరంలోనే కాసేపు కునుకు తీశారు. అయితే వారు నిద్రిస్తున్న సమయంలోనే అకస్మాత్తుగా దూసుకొచ్చిన అలలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లగా.. రెస్క్యూ బృందాలు గాలించి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి వెళ్లేలోపే ఒకరు, చికిత్సపొందుతూ మూడ్రోజుల తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు.