ఫుట్‌పాత్‌లపై నిరాశ్రయులు.. అనాథలపై ఎందుకీ నిర్లక్ష్యం..? ఏపీ సర్కార్ తీరుపై హైకోర్టు అసహనం..

రాత్రిపూట ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న నిరాశ్రయులు, అనాథల దుస్థితిపై ఏపీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అధికారులు వహిస్తున్న నిర్లక్ష్యం అసహనం వ్యక్తం చేసింది. షెల్టర్ హోంల నిర్వహణకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజయవాడతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో షెల్టర్ హోంల ఏర్పాటుపై.. రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలిచ్చింది. నిరాశ్రయులు రాత్రి వేళల్లో ఫుట్‌పాత్‌లపై దయనీయ స్థితిలో నిద్రపోతున్నారని.. వారికి ఆశ్రయం కల్పించే విషయంలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు మేరకు ఆదేశాలు జారీ చేసింది.