భారత్ అమ్ములపొదిలో బ్రహ్మోస్‌ను మించిన క్షిపణి.. 7,400 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న ధ్వని మిస్సైల్

భారత దేశం రక్షణ రంగంలో సరికొత్త శక్తిని సాధించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రపంచంలోనే వేగవంతమైన క్రూయిజ్ క్షిపణిగా గుర్తింపు పొందిన బ్రహ్మోస్ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం ఉన్న అత్యాధునిక హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ (HGV) ‘ధ్వని (Dhvani)’ ని డీఆర్డీఓ అభివృద్ధి చేస్తోంది. గంటకు 7,400 కిలో మీటర్లకు పైగా వేగంతో దూసుకెళ్లే ఈ నూతన క్షిపణి పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వేగంతో పాటు దిశను మార్చుకోగల సామర్థ్యం ఉండటంతో.. శత్రు దేశాల వైమానిక రక్షణ వ్యవస్థలకు ఏమాత్రం స్పందించే సమయం కూడా ఇవ్వకుండా చుక్కలు చూపించనుంది.