శబరిమల ఆలయంలో స్వర్ణతాపడం మాయం..! సిట్ విచారణకు హైకోర్టు ఆదేశం..

శబరిమల ఆలయంలో ద్వారపాలకుల స్వర్ణతాపడం బరువు, వ్యత్యాసంలో తేడా ఉండటంతో వివాదం చెలరేగింది. రాజకీయంగానూ ఈ విషయం కేరళలో దుమారం రేపుతోంది. తాజాగా ఈ బంగారు తాపడాల విషయంలో అవకతవకలపై కేరళ హైకోర్టు సిట్ విచారణకు ఆదేశించింది. ప్రజలు, మీడియాకు ఎలాంటి విషయాలు వెల్లడించకుండా దర్యాప్తును గోప్యంగా నిర్వహించాలని కోర్టు చెప్పింది. నెల రోజుల్లో పూర్తి చేసి నివేదికను నేరుగా కోర్టుకే సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రానెన్‌కోర్ దేవస్థానం బోర్డు విజిలెన్స్ టీమ్ ప్రాథమిక విచారణ నివేదికను పరిశీలించిన తర్వాత హై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.