ఢిల్లీలో భారీ ఆపరేషన్: 285 మంది అరెస్ట్.. 40కి పైగా ఆయుధాలు, కిలోల కొద్దీ డ్రగ్స్ స్వాధీనం

దేశ రాజధానిలో కొత్త ఏడాది వేడుకల జోష్ మొదలవ్వకముందే.. నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టించారు ఢిల్లీ పోలీసులు. అర్థరాత్రి వేళ ఒక్కసారిగా నగరాన్ని చుట్టుముట్టిన వేల మంది పోలీసులు.. ఆపరేషన్ ఆఘాత్ 3.0 పేరుతో మృత్యుపాశం విసిరారు. సామాన్యులు నిద్రపోతున్న వేళ కరుడుగట్టిన నేరగాళ్ల స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించి 285 మందిని కటకటాల్లోకి నెట్టారు. గల్లీ గల్లీలో గాలించి నాటు తుపాకులు, కత్తులు, భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.