తెలంగాణలో గజగజ వణకుతున్న జనం: రికార్డుస్థాయిలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు...రేపు, ఎల్లుండి 25 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది.ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే గజగజ వణికిపోతున్నారు.వీటికి తోడు చల్లటి గాలులు సైతం వీస్తున్నాయి. దీంతో పిల్లలు, వృద్దులు చలికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 28 జిల్లాల్లో 10 డిగ్రీలలోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి ఉంటే ఉష్ణోగ్రతలు ఎంతలా పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గత పదేళ్లలో ఇంత తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే.అంతేకాదు డిసెంబర్ రెండో వారంలో ఎక్కువ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవడం కూడా ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మరీ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు., News News, Times Now Telugu