తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ 'సమగ్ర సంక్షేమ కార్డు'.. ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్, సీఎం ఆదేశాలు

తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క పౌరుడికీ సమగ్ర సంక్షేమ కార్డు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కో పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నింటినీ ఆ కార్డులో పొందుపరచాలని నిర్ణయించింది. ఇందుకోసం సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సూచించారు. అవసరమైతే ఆధార్ తరహాలో యూనిక్ నంబర్ ఇవ్వాలని పేర్కొన్నారు.