భూగర్భజలాలు కలుషితమైపోయాయి... స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి:డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. స్వచ్ఛమైన తాగు నీరు కావాలంటే డబ్బు పోసి కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘అమరజీవి జలధార’ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ చెప్పుకొచ్చారు.తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలిలో జరిగిన‘అమరజీవి జలధార’శంకుస్థాపన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ‘అమరజీవి జలధార’ ద్వారా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చే 35 ఏళ్లలో 1.21 కోట్ల మంది దాహర్తి తీర్చాలని సంకల్పించాం అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతం వెంబడి నివసించే మత్స్యకార సోదరులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ శాతం తీర ప్రాంతాలను కలిపేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు., News News, Times Now Telugu