మధ్యాహ్న భోజనం వండే అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం: వైఎస్ జగన్

ఏపీ ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ల విధానంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. స్మార్ట్ కిచెన్ల కారణంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలోని 85 వేల మంది అక్మచెల్లెమ్మల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని జగన్ ఆరోపించారు. టీడీపీ నేతల పొట్ట నింపుతూ.. అక్కా చెల్లెమ్మల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.