షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో.. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరి, వీడియో వైరల్

పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి సురక్షిత ప్రాంతమైన నిజం మరోసారి బహిర్గతమైంది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఆ దేశంలో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నారో చెప్పడానికి ఇస్లామాబాద్‌లో జరిగిన ఒక ఘటనే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సోదరుడు షాహిద్ అక్తర్ అంత్యక్రియల్లో నిషేధిత లష్కరే తోయిబా అగ్రనేతలు బహిరంగంగా పాల్గొన్నారు. వీరిలో 26 మంది భారతీయులను పొట్టనబెట్టుకున్న పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి, లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ కూడా ఉండడం గమనార్హం.