మహారాష్ట్రలో పరీక్షకు 24 గంటల ముందే టెట్ ప్రశ్నాపత్రం లీక్.. దెబ్బకు ఎగ్జామ్ వాయిదా!

మహారాష్ట్రలో నిరుద్యోగ అభ్యర్థుల ఆశలపై పేపర్ లీకేజీ వ్యవహారం మరోసారి నీళ్లు చల్లింది. జూన్ 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన టీఈటీ (టెట్ - 2026) అర్హత పరీక్ష.. ప్రశ్నాపత్రం లీక్ కావడంతో ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. థానే జిల్లా భివాండిలో పరీక్షకు కేవలం 24 గంటల ముందే సీల్డ్ క్వశ్చన్ పేపర్ కాపీలను కలిగి ఉన్న ఒక ముఠాను పోలీసులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి ప్రకటించింది.