సొంత ప్రజలపైనే పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. భారీ ఆపరేషన్ చేపట్టిన పాక్ సైన్యం

పాకిస్తాన్ సైన్యం.. తమ సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపిస్తోంది. బలూచిస్తాన్‌లోని ఖుజ్దార్ జిల్లా జెహ్రీలో నాలుగో రోజు సైనిక ఆపరేషన్ కొనసాగిస్తోంది. బలూచ్ స్వాతంత్ర్య సమూహాలైన బీఎల్ఏ, బీఎల్ఎఫ్ దాడులను తిప్పికొట్టేందుకు పాక్ సైన్యం డ్రోన్లు, షెల్లింగ్‌తో దండయాత్ర చేస్తోంది. ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడం.. రోడ్లు మూసివేయడంతో ఆ ప్రాంతంలో మానవతా సంక్షోభం తలెత్తుతోంది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర పెట్రోల్, ఆహార కొరత ఏర్పడింది.