Gaurav Gogoi: "అవును, నేను నా భార్య 10 రోజులు పాకిస్థాన్‌లో గడిపాం.. కానీ".. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడి సంచలన ప్రకటన!

Gaurav Gogoi: అస్సాంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీనికి కారణం అస్సాం సీఎం హిమంత బిశ్వ ఇటీవల చేసిన సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ అధ్యక్షుడికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయనే కోణంలో సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ తీవ్రంగా ఖండించారు. తనను పాకిస్థాన్‌తో లింక్ చేయడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. నిన్న (మంగళవారం) గువాహటిలో మీడియాతో మాట్లాడిన గోగోయ్.. తన భార్య ఎలిజబెత్ కొల్బర్న్ 2013లో పాకిస్థాన్ వెళ్లిందని ఒప్పుకున్నారు. కానీ.. ఓ పని నిమిత్తం మాత్రమే పాకిస్థాన్ వెళ్లిందని స్పష్టం చేశారు. పది రోజుల పాటు పాకిస్థాన్‌లో ఉన్నామని.. తన భార్యతో పాటు తాను కూడా అక్కడే ఉన్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఎప్పుడూ ఎవరూ తనను ప్రశ్నించలేదని.. ఇది ఎలాంటి రహస్య ప్రయాణం కాదన్నారు. ఇప్పుడు ఈ విషయంపై రాద్ధాంతం చేయడం సరికాదని పేర్కొన్నారు.

Gaurav Gogoi: