Rohit Sharma: రోహిత్ శర్మకి పద్మశ్రీ ప్రకటించిన కేంద్రం.. మే 25న ఆ అవార్డును ఎందుకు అందుకోలేదు?

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మే 25న న్యూఢిల్లీలో జరిగిన పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాకపోవడం అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. అద్భుతమైన సేవలు, అత్యుత్తమ నాయకత్వ ప్రతిభ, అంతర్జాతీయ వేదికలపై సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం రోహిత్ శర్మతో పాటు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు సైతం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. అయితే, ఇంగ్లాండ్‌లో జరగబోయే మహిళల వన్డే ప్రపంచ కప్ సన్నాహకాల్లో బిజీగా ఉన్నప్పటికీ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రత్యేకంగా సమయం కేటాయించి స్వయంగా హాజరై ఈ అవార్డును అందుకున్నారు. కానీ, రోహిత్ శర్మ కొన్ని షెడ్యూల్ కారణాల వల్ల ఈ మొదటి విడత అవార్డుల ప్రధానోత్సవానికి రాలేకపోయారు. సాధారణంగా పద్మ అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో కొన్ని వారాల వ్యవధిలో వేర్వేరు బ్యాచ్‌లుగా విభజించి, పలు కార్యక్రమాల ద్వారా అందజేస్తుంటారు. అందువల్ల రోహిత్ శర్మ ఈ ఏడాది చివర్లో జరగబోయే తదుపరి కార్యక్రమంలో అధికారికంగా తన పతకాన్ని అందుకోనున్నారు.