అమెరికాలోని వృద్ధులకు భారతీయుడి టోకరా.. రూ.20 కోట్లు మోసం చేసినందుకు ఏడున్నరేళ్ల జైలుశిక్ష

అమెరికాలోని వృద్ధులను లక్ష్యంగా చేసుకుని, ప్రభుత్వ అధికారులమని నటిస్తూ.. ఇంపోస్టర్ స్కామ్‌కు పాల్పడిన భారతీయ వ్యక్తికి అక్కడి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ముఖ్యంగా 38 ఏళ్ల వయసు కల్గిన లిగ్నేష్‌ కుమార్ హెచ్. పటేల్‌.. ఇల్లినాయిస్, మిస్సోరితో సహా ఐదు రాష్ట్రాల్లో 11 మంది వృద్ధులను మోసం చేసి.. 2.2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.20 కోట్లు) విలువైన డబ్బు, బంగారం కాజేశాడు. పోలీసులకు చిక్కగా.. కోర్టులో తన తప్పును కూడా ఒప్పుకున్న పటేల్‌కు న్యాయస్థానం 90 నెలల (ఏడున్నర సంవత్సరాల) ఫెడరల్ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధితులకు 2 మిలియన్ల డాలర్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.