గోవా నైట్‌క్లబ్ అగ్నిప్రమాద కేసు: థాయ్‌లాండ్‌లో లుథ్రా సోదరులు అరెస్ట్, భారత్‌కు ఎప్పుడు అప్పగించనున్నారంటే?

గోవాలోని బిర్చ్ బై రోమియో లేన్ నైట్‌క్లబ్ అగ్నిప్రమాదం కేసులో కీలక పురోగతి లభించింది. ప్రమాదం జరిగిన వెంటనే భారత్ నుంచి థాయ్‌లాండ్‌లోని పుకెట్‌కు పారిపోయిన క్లబ్ యజమానులు, ప్రధాన నిందితులు అయిన సౌరభ్ లుథ్రా, గౌరవ్ లుథ్రా సోదరులను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 6వ తేదీ రాత్రి జరిగిన సిలిండర్ పేలుడు, బాణసంచా కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ నిందితుల పాస్‌పోర్టులు సస్పెండ్ అయిన నేపథ్యంలో.. వారిని రాబోయే 24 గంటల్లో భారత్‌కు తిరిగి అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.