లోక్‌సభలో ఈ-సిగరెట్ తాగిన టీఎంసీ ఎంపీ.. స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ

శీతాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభలో మరో వివాదాస్పద అంశం తెరపైకి వచ్చింది. దేశంలో నిషేధించబడిన ఈ-సిగరెట్‌ను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి చెందిన ఒక ఎంపీ సభ లోపల ధూమపానం చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా.. స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. సభ లోపల ధూమపానానికి అనుమతి లేదు. లిఖితపూర్వక ఫిర్యాదు అందిన వెంటనే ఆ ఎంపీపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం అని స్పీకర్ బిర్లా స్పష్టం చేశారు. ఒకవైపు ఓటు చోరీ ఆరోపణలపై అమిత్ షా, రాహుల్ గాంధీ మధ్య వాదోపవాదాలు నడుస్తుండగానే.. ఈ-సిగరెట్ వివాదం పార్లమెంటులో కొత్త అలజడికి దారి తీసింది.