త్వరలోనే ప్రధాని మోదీతో నెతన్యాహు సమావేశం: ఇజ్రాయెల్ పీఎంఓ

భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు త్వరలోనే భారత పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నెతన్యాహు.. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ ద్వారా ఆత్మీయ సంభాషణ జరిపారు. ఈ చర్చల అనంతరం ఇరు నేతలు త్వరలో సమావేశం కావాలని అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ధృవీకరించింది. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT), స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వంటి కీలక వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల మంత్రులు ఇప్పటికే పర్యటనలు జరిపి పురోగతి సాధించిన నేపథ్యంలో.. ఈ శిఖరాగ్ర సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.