ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల గుర్తింపు కార్డు నిబంధన తొలగించాలి...రవాణాశాఖ మంత్రిని కోరిన ఆర్టీసీ యూనియన్ నేతలు

ఆర్టీసి బస్సుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళా ప్రయాణీకుల సంఖ్య చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో గుర్తింపు కార్డుల తనిఖీ నిబంధనలు తొలగిస్తే కండక్టర్లపై ఉన్న పనిబారం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రభుత్వానికి మహిళా ప్రయాణీకులలో మరింత ఆదరణ లభిస్తుంది అని రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే స్త్రీశక్తి పథకం భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా అమలవ్వాలంటే అదనంగా ఇప్పుడు ఉన్న బస్సులు కాకుండా మూడువేల బస్సులను పెంచి, అన్నికేటగిరుల్లో పదివేల మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో రద్దు చేయబడిన మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగం లేదా అడిషనల్ మానిటరీ బెనిఫిట్ సదుపాయాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జి.ఓ. నెం.58 జారీ చేసినందుకు గాను రవాణా మంత్రికి యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం వెనుక VC & MD సహకారం, మంత్రి ప్రోత్సాహం కీలకమని నాయకులు పేర్కొన్నారు., News News, Times Now Telugu