ఇంటర్‌ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివి, ఇటీవల విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణులు కాలేని విద్యార్థులపై రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. త్వరలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షలను బాగా రాసి, కచ్చితంగా ఉత్తీర్ణులయ్యేందుకు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ఈ నెల 24వ తేదీన ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టులు, ప్రతి చాప్టర్‌ కవర్‌ అయ్యేలా రోజూ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ వచ్చే నెల 20వ తేదీ వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు.