ఇలాంటి పనికిరాని వస్తువులను పడేయకండి.. లెక్కగట్టి డబ్బులు ఇస్తారు..!

డిజిటలీకరణ వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ-వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఈ సస్టెయిన్‌బిలిటీ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ-వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్ కేంద్రాలను ప్రారంభించనుంది. ప్రజలు తెచ్చిన ఈ-వ్యర్థాలకు నగదు చెల్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ-వేస్ట్ నిర్వహణపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించింది.