ఎస్వీ వైద్య కళాశాలలో పది మంది వైద్యులకు నోటీసులు

ఎలాంటి సమాచారం లేకుండా కొన్నేళ్లుగా విధులకు హాజరుకాని ఎస్వీ వైద్య కళాశాలకు చెందిన 10 మంది వైద్యులకు డీఎంఈ నుంచి గురువారం నోటీసులు వచ్చాయి. ఎస్వీ వైద్య కళాశాల అనుసంధానం రుయా, ప్రసూతి ఆస్పత్రుల్లో పనిచేసే కొందరు వైద్యులు కొంత కాలంగా విధులకు హాజరుకావడం లేదు. దీనిపై వివరణ కోరుతూ కళాశాల ప్రిన్సిపల్‌ నోటీసులు జారీ చేసినా వారి నుంచి సమాధానం లేదు. ఈ క్రమంలో రుయాస్పత్రిలోని న్యూరాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.రాజశేఖర్‌ 16 నెలలు, రేడియోథెరపీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎన్‌.ఆర్ముగం మూడేళ్లు, జనరల్‌ సర్జరీ విభాగం డాక్టర్‌ అజగముత్తు రెండేళ్లు, చిన్నపిల్లల విభాగం డాక్టర్‌ కె.దిలీ్‌పసత్య మూడేళ్లు, పిడియాట్రిక్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సాయిప్రసన్న మూడేళ్లు, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ సి.మంజుయాదవ్‌ రెండేళ్లు, నెఫ్రాలజీ విభాగం డాక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.పావని 18 నెలలు, ప్రసూతి ఆస్పత్రికి చెందిన డాక్టర్‌ ఎస్‌.వంశీప్రియ, డాక్టర్‌ టి.తనూజ, డాక్టర్‌ టీఎం గీతావాణి 16 నెలలుగా ఎటువంటి సమాచారం లేకుండా విధులకు హాజరుకావడం లేదని గుర్తించి నోటీసులిచ్చారు. వారంలోపు వివరణ ఇవ్వాలని, లేకపోతే తదుపరి చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన డీఎంఈకి నివేదిక అందిస్తామని ప్రిన్సిపల్‌ రవిప్రభు తెలిపారు.