ఒక భూమి.. ఎన్నో మలుపులు!

land.. dispute పలాస మండలం బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో సర్వేనెంబరు 67లో ఉన్న ప్రభుత పోరంబోకు భూమి వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఇక్కడ మొత్తం 198 ఎకరాల్లో 150 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సుడాకు అప్పగించి ప్రభుత్వ లేఅవుట్‌గా అభివృద్ధి చేస్తోంది. మిగిలిన భూమి అసైన్డ్‌గా మార్చి కొంతమందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. ఎక్కడయినా ప్రభుత్వ భూమి చేతులు మారాలంటే ప్రత్యేక కమిటీ వేసి.. ఆ భూమిని అప్పగించాలి. కానీ ఇక్కడ మాత్రం కొనుగోలు పత్రాలతో ఐదెకరాల భూమి.. మొత్తం ఐదుగురు వ్యక్తుల చేతులు మారి చివరకు మిలటరీ పోరంబోకు భూమిగా రూపాంతరం చెందింది. చివరకు ఆ భూమిని కూడా నిరభ్యంతర పత్రాలు తెచ్చుకుని పబ్లిక్‌గా అమ్మకానికి పెట్టడం చర్చనీయాంశమవుతోంది.