తెలంగాణ పర్యటనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. వారితో సమావేశం..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం రోజు కొండగట్టులో పర్యటించనున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్ కళ్యాణ్.. టీటీడీ సహకారంతో కొండగట్టులో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జనసేన పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అలాగే తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో విజయం సాధించిన వారితోనూ పవన్ కళ్యాణ్ రేపు సమావేశం కానున్నారు.