ప్రపంచపటం నుంచి పాకిస్థాన్‌ను తొలగిస్తాం: భారత ఆర్మీ చీఫ్ సంచలన ప్రకటన

భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానకపోతే.. దాని భౌగోళిక ఉనికికే ముప్పు వాటిల్లుతుందని, ప్రపంచ పటం నుంచి కనుమరుగవుతుందని స్పష్టం చేశారు. ఈసారి భారత దళాలు ఎలాంటి సంయమనం పాటించవని.. అవసరమైతే పాకిస్థాన్‌ను చరిత్ర నుంచి చెరిపివేసేందుకు వెనుకాడబోమని అన్నారు. అలాగే ఆపరేషన్ సిందూర్ రెండో వెర్షన్ అమలు చేయడం సుదూరంలో లేదని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చారు. సైనికులను కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.