మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం.. విచారణకు ఆదేశించడంతో క్రీడా శాఖ మంత్రి రాజీనామా

ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో జరిగిన GOAT టూర్ ఈవెంట్.. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సాల్ట్ లేక్ స్టేడియంలో నెలకొన్న తీవ్ర గందరగోళం, అభిమానుల ఆందోళనల కారణంగా క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించడంతో.. విచారణ నిష్పాక్షికంగా జరిగేందుకు రాజీనామా చేస్తున్నట్లు బిస్వాస్ తెలిపారు. కేవలం మంత్రి రాజీనామాతో ఆగకుండా ఈ ఘటనకు బాధ్యులైన డీజీపీ రాజీవ్ కుమార్ సహా పలువురు సీనియర్ పోలీసు, ప్రభుత్వ అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.