'యుద్ధం మొదలైతే అంతుచిక్కని అస్త్రాలతో దాడి చేస్తాం': ఇరాన్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ.. అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ శాంతి చర్చలు ఫలించక, యుద్ధం మళ్లీ మొదలైతే.. మేము కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతామని.. యుద్ధ భూమిలోనే శత్రుదేశాలకు వాటి రుచి చూపిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ​మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్​ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది.