రూ.500 కోట్లు ఇస్తేనే కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ: మాజీ ఎమ్మెల్యే సంచలనం

పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడి భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ సస్పెన్షన్ తర్వాత కూడా దూకుడును కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ రూ. 500 కోట్లు తీసుకుంటుందని చెప్పిన ఆమె.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరుపుతున్నానని.. అయితే పార్టీని నాశనం చేస్తున్న నలుగురైదుగురు దొంగలకు తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతివ్వబోనని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌జిందర్ సింగ్ రాంధావా పంపిన లీగల్ నోటీసుపై ఆమె తీవ్రంగా స్పందిస్తూ.. రాంధావా టికెట్లు అమ్ముకున్నారని, స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని వంటి తీవ్ర ఆరోపణలతో ఎదురుదాడికి దిగడం పంజాబ్ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.