రయ్యుమని పరుగులు పెడుతున్న రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి, వీడియో వైరల్

థాయ్‌లాండ్‌లోని సిఖియో జిల్లాలో బుధవారం ఉదయం సంభవించిన ఘోర రైలు ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిర్మాణ పనుల్లో ఉన్న ఒక భారీ క్రేన్ అదుపుతప్పి కదులుతున్న రైలుపై పడటంతో.. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్రేన్ ధాటికి బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా పెట్రోల్ ట్యాంకులు పేలి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఈ భీకర ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది మృత్యువుతో పోరాడుతున్నారు.