అమెరికాతో శత్రుత్వం వేళ.. రూ. 22 వేల కోట్ల విలువైన క్షిపణులను రష్యాకు పంపిన ఇరాన్

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న సుదీర్ఘ పోరులో ఇప్పుడు ఇరాన్ అత్యంత కీలకమైన ఆయుధ గిడ్డంగిగా మారింది. లోకమంతా ఆంక్షలతో రష్యాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే.. ఇరాన్ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వందల కొద్దీ బాలిస్టిక్ క్షిపణులను మాస్కోకు తరలిస్తోంది. తాజాగా బయటపడిన నివేదికల ప్రకారం.. కేవలం క్షిపణుల కోసమే రష్యా ఇరాన్‌కు సుమారు రూ. 22,600 కోట్లు (2.7 బిలియన్ డాలర్లు) చెల్లించినట్లు తెలుస్తోంది. యుద్ధం మొదలవ్వక ముందే కుదిరిన ఈ రహస్య ఒప్పందం ద్వారా ఫతా-360 వంటి విధ్వంసకర క్షిపణులు ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్నాయి.