ఎవరెస్టు శిఖరంపై మంచు తుఫాను.. చిక్కుకుపోయిన 1000 మందికిపైగా పర్వతారోహకులు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు పర్వతంపై భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపు దాదాపు 1000 మంది పర్వతారోహకులు చిక్కుకుపోయారు. చైనా ప్రభుత్వ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. అధికారులు, స్థానికులు కలిసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటికే 350 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చలి తీవ్రత అధికంగా ఉండటంతో కొందరు హైపోథెర్మియా బారిన పడ్డారు. అక్టోబర్లో ఇంతటి విపరీత వాతావరణం అసాధారణమని గైడ్లు చెబుతున్నారు.