ఏడాది చిన్నారిపై పిట్‌బుల్ దాడి.. యజమానిపై కేసు పెట్టేందుకు పోలీసుల నిరాకరణ

అగ్రరాజ్యం అమెరికాలో పిట్‌బుల్ జాతి కుక్క.. ఏడాది వయసున్న పసికందుపై పులిలా విరుచుకుపడింది. తల్లి కళ్లముందే ఆ పసివాడి కాలును తన దవడలతో గట్టిగా నొక్కి పట్టి, మాంసాన్ని పీల్చేసింది. స్థానికులు కుక్కను తన్నినా, గొంతు నులిమినా అది పట్టు సడలించకపోవడంతో అక్కడున్న వారు ప్రాణభయంతో వణికిపోయారు. చివరికి ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి చేసిన సాహసంతో ఆ పసివాడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. ఇంత ఘోరం జరిగినా కుక్క యజమాని మాత్రం ఏమీ జరగనట్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోవడం, పోలీసులు అతనిపై కేసు పెట్టేందుకు నిరాకరించడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది.