పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం.. 1,400కు పైగా బడులు తాత్కాలిక మూసివేత

telangana Zero Schools Closed: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయులు ఇద్దరూ లేని 1400కు పైగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. దేశంలోనే జీరో పాఠశాలల్లో తెలంగాణ ముందుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మూసివేతతో యూడైస్ గణాంకాల్లో రాష్ట్ర పనితీరు మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రామస్థులు కోరితే ఆ పాఠశాలలను మళ్లీ తెరుస్తామని హామీ ఇచ్చారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచే వీటిని తాత్కాలికంగా మూసి వేయనున్నారు.