ఒబామా దంపతులను కోతులతో పోలుస్తూ వీడియో షేర్ చేసిన ట్రంప్.. ఆపై తన తప్పేమీ లేదంటూ..!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అమెరికాను కుదిపేస్తోంది. దేశపు ఏకైక నల్లజాతీయుడైన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను, ఆయన సతీమణిని కోతులతో పోలుస్తూ ట్రంప్ షేర్ చేసిన వీడియోపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈక్రమంలోనే ఆయన తాజాగా స్పందించారు. తాను ఈ వీడియోను పూర్తిగా చూడలేదని, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్యాంపరింగ్ అయినట్లు చూసిన వెంటనే పోస్ట్ చేశానని చెప్పారు. కానీ విషయం తెలిశాక దీన్ని డిలీట్ చేశానని.. తన తప్పేమీ లేదని స్పష్టం చేశారు. అలాగే తాను ఎవరికీ క్షమాపణలు చెప్పనని కూడా పేర్కొన్నారు.