కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే అనుచరుల మధ్య భీకర పోరు.. ఒకరి మృతి, ఎక్కడంటే?

ఇంతకాలం పాటు ప్రశాంతంగా ఉన్న బళ్లారి మరోసారి రాజకీయ కక్షలతో అట్టుడికిపోయింది. వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సాక్షిగా.. ఇద్దరు బలమైన నేతల మధ్య రాజుకున్న బ్యానర్ల రగడ చివరకు తుపాకీ గర్జనలకు, ఒకరి ప్రాణం పోవడానికి దారితీసింది. ఎమ్మెల్యే గాలి జనార్ధన రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గీయులు వీధుల్లోకి వచ్చి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో రణరంగంలా మారింది. ఈ గందరగోళంలో ఒక గన్‌మెన్ జరిపిన కాల్పులు రాజశేఖర్ అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాన్ని బలితీసుకున్నాయి.