టర్కీలో కుప్పకూలిన విమానం.. లిబియా ఆర్మీ చీఫ్ మృతి

అంతర్జాతీయ రక్షణ వర్గాలను షాక్‌కు గురిచేస్తూ టర్కీ రాజధాని అంకారా సమీపంలో ఒక ప్రైవేట్ జెట్ కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో లిబియా సైన్యాధ్యక్షుడు మహమూద్ అలీ అల్ హద్దాద్‌తో సహా ఎనిమిది మంది కీలక అధికారులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టర్కీతో రక్షణ ఒప్పందాలను ముగించుకుని సగర్వంగా స్వదేశానికి వెళ్తున్న సమయంలో.. టేకాఫ్ అయిన 40 నిమిషాలకే సాంకేతిక లోపం రూపంలో మృత్యువు విరుచుకుపడింది.